పొలం పిలుస్తోంది – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జూన్17:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులకు సాగు ఖర్చులు తగ్గించి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ అధిక దిగుబడులు సాధించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు అన్నారు. చిట్టెలబ గ్రామంలో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి మంగళ మరియు బుధవారాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించబడుతుందని రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు పోడు వ్యవసాయంలో గిరిజన రైతులు ఎక్కువగా చిరుధాన్యాలు పండిస్తున్నారని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా చిరుధాన్యాలకు మంచి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని చోడి పంటకు కేజీ 49 రూపాయలకు పైగా మద్దతు ధర ఉందని కాబట్టి చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కోరారు చిరుధాన్యాలను మరియు వరి వంటి విత్తనాలను 90% రాయితీపై గిరిజనులకు అందిస్తున్నామని ప్రభుత్వం ఇచ్చే ఈ రాయితీలను సద్వినియోగం చేసుకొని పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా నూతన సాంకేతిక సాగులో మెలకువలను తెలుసుకుని సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడిని కూడా పెంచాలని కోరారు గ్రామంలో నలుగురు రైతులు అన్నదాత సుఖీభవ ఈ కేవైసీ చేయించుకోలేదని వారు ఈ కేవైసీ పూర్తి చేసుకుంటే అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు అవుతారని తెలిపారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ప్రకృతి సేద్య ఉత్పత్తులకు అధిక ధరలు కల్పించాలని అలాగే ప్రకృతి సేద్యానికి కావలసిన ముడి సరుకులను కూడా రాయితీపై అందిస్తే పోడు వ్యవసాయపు దిగుబడులు పెంచుకోగలుగుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు కిరణ్ కుమార్ ప్రకృతి సేద్య క్లస్టర్ ఇంచార్జ్ సురేష్ కుమార్ అప్పన్న మరియు రైతులు పాల్గొన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!