ఏపీ లిక్కర్‌ స్కాంలో.. చెవిరెడ్డి పేరు చెప్పాలని చిత్ర హింసలు – ట్‌ అధికారులు కొట్టడంతో ఆసుపత్రిల పాలైన హెడ్ కానిస్టేబుల్ మదన్

సిట్ అధికారులు చిత్రవద్ధ చేశారని డీజీపీకి స్వయంగా లేఖ రాసిన హెడ్ కానిస్టేబుల్ మదన్.అవాస్తవాలు తాను చెప్పలేను అన్నందుకు బూతులు తిట్టి నరకం చూపించారు.సిట్ అధికారులు తీవ్రంగా కొట్టడంపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు.సిట్ అధికారుల వేదింపులు, చిత్రవధపై నేడు హైకోర్టులో విచారణ
మన న్యూస్, తిరుపతి: – ఏపీ లిక్కర్‌ స్కాంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరు చెప్పాలని ఆయనతో పాటు తిరిగిన వారిని, సన్నిహితంగా మెలిగిన వారిని సిట్ అధికారులు చిత్ర హింసలకు గురి చేస్తున్నార. చెవిరెడ్డి వెంట తిరిగిన వారిని ఒక్కొక్కరినీ పట్టుకుని చిత్రవధకు గురిచేస్తున్నారు. పోలీసులని కూడా చూడకుండా గతంలో గన్ మెన్ లుగా పనిచేసిన వారిపై థార్డ డిగ్రీ ప్రయోగించారు. బలవంతంగా చెవిరెడ్డికి లిక్కర్ స్కాంలో భాగమున్నట్లు చెప్పాలని నరకం చూపించారు. తప్పుడు స్టేట్‌మెంట్లు, ముందే తయారు చేసిన స్క్రిప్ట్‌లు వారిచేత చదివించి వీడియో రికార్డులు చేశారు. సిట్‌ కార్యాలయంలో కాకుండా రహస్య ప్రదేశాలకు తరలించి టార్చర్‌ చేశారు. గతంలో చెవిరెడ్డికి గన్‌మెన్‌లుగా పనిచేసిన వారిని లాఠీలతో కుళ్లబొడిచి గాయాలపాలు చేయడంతో వారు ఆసుపత్రిలో చేరారు.

మొన్న గిరి.. నిన్న మదన్‌.. ఆపై వెంకటేష్‌.. చివరగా బాలాజీ.. చెవిరెడ్డికి అంగరక్షకులుగా.. అత్యంత సన్నిహితులుగా మెలిగిన వారిని బలంవంతగా అరెస్టు చేసిన సిట్‌ అధికారులు రోజుల తరబడి తమ అదుపులో పెట్టుకుని చిత్రవధ చేస్తున్నారు. మొదటగా గన్‌మెన్‌ గిరిని పట్టుకుని తీవ్రంగా కొట్టి భయపెట్టి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. ఆ తరువాత మరో గన్‌మెన్‌ మదన్‌ను విచారణకు పిలిపించి నరకం చూపారు.. విచక్షణా రహితంగా కొట్టి శారీరకంగా, మానసికంగా చిత్రవధకు గురిచేశారు. అలాగే చెవిరెడ్డికి సన్నిహితులైన వెంకటేష్‌నాయుడు, అతని కుటుంబీకులను వేదింపులకు గురిచేసి టార్చర్‌ పెట్టారు. చివరగా బాలాజీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఐదు రోజుల పాటు నరకం చూపారు. వీరందరి నుంచి సిట్‌ అధికారులు కోరుకున్నది ఒక్కటే.. అదేమంటే.. చెవిరెడ్డికి ఏపీ లిక్కర్‌ స్కాంతో సంబంధం వుందని చెప్పాలని ఒత్తి చేయడం. బలవంతపు స్టేట్‌మెంట్‌లు, వీడియోరికార్డులు చేసుకున్న సిట్‌ అధికారులు పట్టుబడిన వారందరిపైనా థార్డ్‌ డిగ్రీ ప్రయోగించడం విశేషం. సిట్‌ అధికారుల దెబ్బలకు తీవ్రంగా గాయపడిన ఓ గన్‌మెన్‌ మదన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటమే నిలువెత్తు సాక్షం. ఎవ్వరి కళ్లలో ఆనందం చూడటానికి సిట్‌ అధికారులు ఇదంతా చేస్తున్నారో తెలియదు కానీ సామాన్యులు, చిన్న, చిన్న ఉద్యోగులు వారి కుటుంబాలు మానసిక వేదనకు గురవుతున్నాయి. సిట్‌ అధికారుల వల్ల బాధింపబడిన వారితో పాటు ఆ కుటుంబాలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.

ఏపీ డీజీపికి హెడ్ కానిస్టేబుల్ మదన్ లేఖ…ఏపీ డీజీపీకి హెడ్ కానిస్టేబుల్ మదన్ స్వయంగా లేఖ రాశారు. తనను సిట్ అధికారులు తప్పుడు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేసి చిత్ర వధకు గురిచేశారని, పోలీసు యూనిఫాం వేసుకుని వున్నా సరే.. తనను పిడి గుద్దులతో శారీరకంగా, మానసికంగా హింసకు గురిచేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎప్పుడు వచ్చినా యూనిఫాం తీసి తమ వద్దకు రావాలని, తాను యూనిఫాంతో వచ్చినందుకు బండ బూతులు తిట్టి కొట్టారని స్వయంగా హెడ్ కానిస్టేబుల్ మదన్ రాసిన లేఖలో డీజీపీకి వివరించారు. తాను మరోసారి సిట్ అధికారుల వద్దకు వెళ్లాల్సి వస్తే ఒంటరిగా వెళ్లనని, ఒక వేళ వెళ్లాల్సి వచ్చినా తనను కొట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆ లేఖలో ప్రాదేయపడ్డారు.

హైకోర్టులో పిల్ దాఖలు..గన్ మెన్ మదన్ ను సిట్ అధికారులు విచక్షణా రహితంగా కొట్టడంతో గత ఆరు రోజులుగా వియవాడలోని ఓ ఆసుపత్రలో చికిత్స పొందుతున్నారు. చెవిరెడ్డికి లిక్కర్ స్కాంతో సంబంధం వుందని తప్పుడు స్టేట్ మెంట్ ఇవ్వాలని సిట్ అధికారులు తనను తీవ్రంగా కొట్టి గాయపరిచారని హెడ్ కానిస్టేబుల్ మదన్ స్వయంగా ఏపీ డీజీపీకి స్వయంగా లేఖ కూడా రాశారు హెడ్ కానిస్టేబుల్ మదన్. అంతేకాదు దీనిపై హైకోర్టులో మదన్ కుటుంబీకులు పిల్ దాఖలు చేయడంతో నేడు విచారణకు ఆదేశించింది ధర్మాసనం. విచారణ సమయంలో సిట్ అధికారులచే గాయపడ్డ మదన్ న్యాయమూర్తి ముందు హాజరై తనను ఏ విధంగా కొట్టారు, ఏఏ రకంగా హిసించారు అన్న వివరాలను తెలియపరచనున్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!