మన న్యూస్, నారాయణ పేట జిల్లా:ఈ రోజు తెలంగాణ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు టీ టీ డి బోర్డ్ మెంబెర్ శ్రీ మహేందర్ రెడ్డి,తెలంగాణ పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ఆర్ కే సాగర్ మరియు కుకట్ పల్లి ఏమెల్యే కంటెస్టెడ్ ప్రేమ్ కుమార్ గార్ల ఆదేశాల మేరకు నారాయణన పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూరు మండలం తిప్రాస్ పల్లె గ్రామానికి చెందిన శివ కుమార్ గారి ఆహ్వానం మేరకు డాక్టర్ మణికంఠ గౌడ్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాన్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి, తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జ్ నెమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు శివ కుమార్ గారి చొరవతో 35 మంది యువకులకు జనసేన పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానం పలికి పార్టీ లోకి స్వాగతించడం జరిగింది. తదనంతరం మణికంఠ గౌడ్ మాట్లాడుతూ, భవిష్యత్ లో తెలంగాణ లో జనసేన పార్టీ ఎనలేని శక్తి గా ఎదిగి ప్రభుత్వ స్థాపన దిశగా అడుగులేస్తోంది అని, తిప్రాస్ పల్లె యువకులు జనసేన పార్టీ కి మద్దతుగా పార్టీ లో చేరినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన స్థానం కల్పిస్తామని, జనసేన పార్టీ స్థానిక ప్రజల యొక్క వివిధ సమస్యలపైన పోరాటాలు చేస్తూ పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కారం చూపే విధంగా ప్రజలకి మీ ద్వారా నమ్మకం, భరోసా ఇవ్వాలని తెలిపారు.మరియు రానున్న స్థానిక ఎన్నికలలో జనసేన పార్టీ మన మక్తల్ నియోజక వర్గం లో కూడా సత్తా చాటుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, శంకర్, శివ, నరేష్, గోపి,జనార్దన్, మక్తల్ నియోజకవర్గం సీనియర్ నాయకులు గౌడీ బలరెడ్డి , రామన్ గౌడ్ , శివ , భీమేష్ , పవన్ , మహేష్ , నవీన్ గౌడ్ , ఆంజనేయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *