నర్వ , Mana News :- తేదీ 03/06/2025 రోజు రాత్రి సమయంలో నర్వ పోలీస్ సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు పెద్దకడుమూరు గ్రామంలో ఎరుకలి నరసింహ ఇంట్లో తనిఖీ చేయగా ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే రేషన్ బియ్యం లబ్ధిదారుల నుంచి సేకరించి 20 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యంను అక్రమంగా తన ఇంట్లో నిల్వ ఉంచుకోవడం జరిగింది తర్వాత DT పంచనామా నిర్వహించి బియ్యం ను సీజ్ చేసి నరసింహపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుగుతుంది అని ఎస్సై కుర్మయ్య తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పేదలకు సరఫరా చేసి రేషన్ బియ్యం ను లబ్ధిదారుల నుంచి సేకరించిన మరియు రవాణా చేసిన కేసులు నమోదు జరుగుతాయని SI తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *