

ఎస్ఆర్ పురం, మన న్యూస్… గ్రామాల్లో అల్లర్లు గొడవలు చేసే ఆకుతాయల ఆటలను ఆట కట్టిస్తాం అని నగిరి డిఎస్పి సయ్యద్ మహమ్మద్ అజీజ్ అన్నారు.. ఎస్ఆర్ పురం మండలం పిల్లారి కుప్పం క్రాస్ రోడ్డు కటింగ్ షాపు పని చేసే ఓ వ్యక్తిని చిన్న తయూరు గ్రామానికి చెందిన చందు ,ప్రశాంత్, ఉదయ్ వీరు ముగ్గురు యువకులు మద్యం సేవించి కటింగ్ షాపు పని చేసే వ్యక్తిపై అకారణంగా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ సంఘటన తెలుసుకున్న నగిరి డిఎస్పి ఆదేశాలతో ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్ కటింగ్ షాపులో దాడికి పాల్పడిన చిన్న తయ్యూరు గ్రామానికి చెందిన చందు ప్రశాంత్ ఉదయ్ ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు అనంతరం ఎస్ఆర్ పురం తాసిల్దార్ ముందు బైండోవర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ సుమన్ మాట్లాడుతూ గ్రామాల్లో మద్యం సేవించి గంజాయి సేవించి అల్లర్లు గొడవలు చేసే యువకులు ఎవరైనా ఉంటే వారిపై రౌడీషీట్ నమోదు చేస్తాం అలాంటి ఆకుతాయిలు అల్లర్లు ఇకపై సాగవు ఎక్కడైనా ఇలాంటివి జరిగితే వెంటనే 9440900692కు తెలియజేయాలని ఎస్ఐ సుమన్ తెలిపారు.