

తిరుపతి,మేజర్ న్యూస్ :- లేపాక్షి నంది నోట్ బుక్స్ లను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా మంగళవారం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వము వినూత్న పద్ధతిలో ఖచ్చితమైన పేజీలతో సరసమైన ధరలకు విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా లేపాక్షి నంది నోట్ బుక్స్ లను సరసమైన ధరలకు అందించడం జరుగుతోందని చెప్పారు. ఏపీ టీపీసీ లిమిటెడ్ వారిచే ఈ నోట్ బుక్ లను మార్కెట్లోకి విడుదల చేయడం జరిగిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఈ నోట్ పుస్తకాలను తక్కువ ధరలతో అందించడం జరుగుతుందన్నారు. అనంతరం లేపాక్షి నంది నోట్ బుక్స్ డిస్ట్రిబ్యూటర్ కే జ్ఞాన శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతియటా రాష్ట్ర ప్రభుత్వం వారిచే లేపాక్షి నంది నోట్ బుక్స్ లను విద్యార్థులకు సరసమైన ధరలకు అందించడం జరుగుతోందని చెప్పారు. నాణ్యతతో కూడిన పేజీలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అత్యధిక డిస్కౌంట్ను కూడా ఇస్తామని చెప్పారు. రెడ్ లైసెన్స్ కలిగిన బుక్ స్టాల్ యజమానులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక డిస్కౌంట్ ఇస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 91-9505199855, 91-9963484962 నెంబర్లలో సంప్రదించవచ్చునని జ్ఞాన శేఖర్ రెడ్డి తెలిపారు.