

పిఠాపురం మే 27 మన న్యూస్ :- ఎన్టీఆర్ 103 వ జయంతోత్సవాలలో భాగంగా మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో, స్థానిక మోహన్ నగర్ లో ఎన్టీఆర్ స్ఫూర్తితో మద్యానికి స్వయనిషేధం ప్రకటించుకుని జీవనం సాగిస్తున్న ,మోహన్ నగర్ వాసులను మద్యపాన వ్యతిరేక ప్రచారం కమిటీ నాయకులు ఎన్. సూర్యనారాయణ, సహృదయ మిత్ర మండలి అధ్యక్షులు తోట శ్రీనివాస్ చేతుల మీదుగా వారిని సత్కరించి, అభినందించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ, మద్యం రహిత సమాజ స్థాపనకు ఒక కలంపోటుతో సమాధానాన్ని అందించిన ఎన్టీఆర్ చిరస్మరణీయులు అన్నారు. ఎన్టీఆర్ ను స్ఫూర్తి గా తీసుకుని ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రజలు మద్యం, మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమం భాగస్వాములు కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు అప్పారావు,నాని బాబు మద్యపానం వ్యతిరే ప్రచార కమిటీ నాయకులు కరణం శ్రీనివాస్, వనపర్తి సూర్యనారాయణ, సహృదయ మిత్రమండలి నాయకులు వరద వీరభద్రరావు, గండేపల్లి సత్యనారాయణ, ఎం. సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.