

గొల్లప్రోలు మే 25 మన న్యూస్ : గొల్లప్రోలు పట్టణ పరిధిలో బీసీ నాయకుడు అంజూరి విజయ రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి అందిస్తున్న రాజకీయ సేవలను ఆ పార్టీ అధిష్టానం గుర్తించి రాంబాబుకు కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా ఆ పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు వెలుపడ్డాయి.ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ అంజురి విజయ రాంబాబును ఆయన నివాసంలో పూలమాలవేసి దుస్సాలులతో సత్కరించారు.పంపన రామకృష్ణ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పద్మశాలి బిడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీగా పదవి పొందినందుకు ఆయనను సత్కరించడం ఆనందంగా ఉన్నదని తెలియజేశారు.విజయ రాంబాబు రానున్న రోజులలో మరిన్ని పదవుల పొంది ఇంకా ఉన్నత శిఖరం ఎదగాలని కోరారు.పద్మశాలీలు మరియు చేనేతలు ఏ పార్టీలో ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత కులాల సమైక్య అధ్యక్షుడిగా సహకరిస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తాటిచెర్ల మధుబాబు,పంపన సూర్యనారాయణ,సూరిశెట్టి సూరిబాబు, మొండి లోవరాజు, జాగు సత్తిబాబు, గిడుతూరి శ్రీనివాస్, కాకి శ్రీనివాస్ , పలువురు వైసీపీ కార్యకర్తలు అభిమానులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.