నాయకుల కార్యకర్తల అభిప్రాయం మేరకే మండల అధ్యక్షులుగా నిర్ణయిస్తా… ఎమ్మెల్యే డాక్టర్ థామస్

90 ఎం.ఎల్ బ్యాచ్ లేనిపోని ఆరోపణలు సృష్టిస్తే.. వారికి పుట్టగతులు ఉండవు..కడపలో జరిగే మహానాడు లో అందరూ పాల్గొని విజయవంతం చేయండి

ఎస్ఆర్ పురం, మన న్యూస్… గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో నాయకుల కార్యకర్తల అభిప్రాయం మేరకే మండల అధ్యక్షులుగా నిర్ణయిస్తా నా సొంత నిర్ణయాలు తీసుకోను అని ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు ఆదివారం ఎస్ఆర్ పురం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు ఈ విస్తృత స్థాయి సమావేశానికి వేలాదిగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తరలి రావడంతో పార్టీ కార్యాలయం పైనుంచి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ప్రసంగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ నాపైన 90 ఎం.ఎల్ బ్యాచ్ లేనిపోని ఆరోపణలు చేస్తూ నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే వారికి పుట్టగతులు లేకుండా చేస్తా నేను ఎక్కడైనా మండల దీక్షల పదవి కోసం డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే నేను గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ 90 ఎం.ఎల్ బ్యాచ్ కి సవాల్ విసిరారు అలాగే 27 28 29 తేదీల్లో కడపలో జరిగే మహానాడు లో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో నుంచి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని తెలియజేశారు అలాగే ప్రతి మండలానికి ఎన్ని బస్సులు అవసరం ఉన్నా ముందుగానే నాకు తెలియజేస్తే అన్ని బస్సులు ఏర్పాటు చేసుకొని అందరూ పాల్గొనవచ్చని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ పురం మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు జిల్లా తెలుగుదేశం నాయకులు గంధమనేని రాజశేఖర్ నాయుడు మునివర్ధనాయుడు, మాజీ మండల అధ్యక్షుడు రుద్రప్ప నాయుడు, మాజీ ఎంపీటీసీ వేమన నాయుడు పైనేని మురళి నియోజకవర్గం ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్ ఆర్టిఐ జిల్లా అధ్యక్షుడు జయరాజ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ మాజీ ఎంపీపీ ఇందిరమ్మ పాలసముద్రం మండలం టిడిపి యువ నాయకుడు శివ కార్వేటి నగరం మండలం మాజీ ఎంపీపీ జనార్దన్ రాజు టిడిపి యువ నాయకుడు మురళి రాజు కార్వేటినగరంమండల అధ్యక్షుడు చెంగల్రాయ్ యాదవ్, గంగాధర్ నెల్లూరు మండల అధ్యక్షుడు స్వామి దాసు, పెనుమూరు మండల అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు,పుల్లూరు బాబు మండల ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు హేమాద్రి యాదవ్, పైనేని ధనుంజయ నాయుడు గజేంద్ర మైనారిటీ నాయకుడు మాబు భాష , ఆరు మండలాల అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు అలాగే వేలాదిమందిగా తరలి రావడంతో కార్వేటినగరం ఎస్ఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఎస్ఐ రాజ్ కుమార్ ను పోలీస్ సిబ్బందిని అభినందించారు

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..