

మన న్యూస్, పాచిపెంట మే 23 :-పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మాతుమూరు గ్రామాన్ని సారా రహిత గ్రామంగా తిర్చి దిద్దుతామని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ బి.నర్సింహమూర్తి అన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నవోదయం 2.0 లో భాగంగా శని ఉదయం మండలంలోని మాతుమూరు గ్రామం సచివాలయ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ ఉషారాణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గ్రామాన్ని సారా రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామని వారంతా తీర్మానం చేసారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ ఎస్సై బి. నర్సింహమూర్తి, ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న అధికారి, పంచాయతీ సెక్రటరీ సుమలత, వీఆర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.