మన న్యూస్ పాచిపెంట మే 24:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో 48 సర్వేనెంబర్ 782 ఎకరాలు కుడుమూరు భూములకు సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాలు మంజూరు చేయాలని 2 వ రోజు పాదయాత్ర కొనసాగింది. మెట్టవలస, కొత్తవలస, శీల, డెప్పిగుడ్డీ, పెడతాడురు మీదుగా కొడతాడురు సాగింది. ఈకార్యక్రమం ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ తాతల కాలం నుండి సాగు చేస్తున్న కుడుమూరు రెవెన్యూ 48 సర్వేనెంబర్ 782 ఎకరాలు ప్రభుత్వ భూమిని 10 గ్రామాలు సుమారు 300 కుటుంబాలకు సాగు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులు అమాయకులు నోరు వయా లేని వాళ్ళు అని గిరిజన భూములను కబ్జా చేయాలని కొంతమంది ప్రయత్నం చేయడం వారికి అధికారులు అండగా నిలవడం చాలా దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇప్పుడు పట్టాలు విషయంపై స్పందించి గిరిజనులకు న్యాయం చేయాలని ఐటీడీఏ పీవో కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులందరూ కూడా పరివేక్షణలో నిజమైనటువంటి గిరిజనులు సాగు చేస్తున్నారని గుర్తించారు. గత ప్రభుత్వం హయాంలో సర్వేలు నిర్వహించి ఆ సర్వే వివరాలను కూడా బయట పెట్టకుండా ఇది ప్రభుత్వ భూమిని తేల్చి ఎందుకు కాలయాపన చేస్తున్నారు. తెలపాలని అన్నారు. కుడుమూరు భూ పోరాట కమిటీ కన్వీనర్ సూకురు అప్పలస్వామి మాట్లాడుతూ తాతల కాలం నుండి సాగు చేస్తున్న మా భూములకు హక్కులు కల్పించాలని పోరాటం చేస్తే మాపైన తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలకు మద్దతుగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ. 48 సర్వే నెంబర్లు ఉన్నటువంటి ప్రభుత్వ భూములకు పట్టాలు మంజూరు విషయంలో అధికారులు నిర్లక్ష్య ద్వారని మంచిది కాదని. సాగు పట్టాలు ఇచ్చేవరకు గిరిజనులు చేస్తున్న పోరాటానికి సిపిఎం ప్రజా సంఘాలు అండగా ఉంటాయని సర్వే వివరాలను బహిర్గతం చేయాలని పట్టాలు ఎప్పుడు ఇస్తారు అనేది అధికారులు వెంటనే తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గిరిజన సంఘం నాయకులు కొర్ర కళ్యాణ్, శ్రీనివాసరావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు సుర్రు రామారావు స్థానిక నాయకులు జన్ని లక్ష్మణరావు, వెంకటేష్ సూక్రు ఎర్రయ్య గిరిజన రైతులు పాల్గొన్నారు.