ఎస్ఆర్ పురం,మన న్యూస్… ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీ ద్రౌపతి ధర్మరాజుల సమేత ఆలయం వద్ద మహాభారత ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు తిరుపతి చెందిన భాగవతారిణి సుమతి ఆధ్వర్యంలో మధ్యాహ్నం హరికథ కాలక్షేపం అందరినీ ఆకట్టుకుంటున్నాయి.. సుమతి హరికథ తో పాటు మధ్య మధ్యలో పాటల పాడుతూ హరికథ చెప్పడంతో భక్తులను గ్రామస్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.. ఈ భాగవతరిణి సుమారు 7 మహాభారత ఉత్సవాల్లో హరికథ చెప్పడంలో పాల్గొన్నారు.. భాగవతరిణి సుమతి హరికథ చెప్పడంలో నవరసాలు దాగి ఉండడంతో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా హరికథను ఆలకిస్తున్నారు అని ఆలయ ధర్మకర్త తెలిపారు ఈ కార్యక్రమంలో హార్మోనిస్ట్ వెంకటరమణ తబలా మాస్టర్ సుధాకర్ వయోలిన్ హేమకుమార్ పాల్గొన్నారు.
