గిరిజనులు సాగు చేస్తున్న భూములు కి ప్రభుత్వము పట్టాలు ఇవ్వాలి

మన న్యూస్ పాచిపెంట మే 23:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాలు సాగులో ఉన్న గిరిజనులు భూములుకు పట్టాలు మంజూరు చేయాలని ఆది వాసి గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిగినయి మొదట పాదయాత్ర సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ వై నాయుడు జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఆదివాసి గిరిజన సంఘం సీనియర్ నాయకులు సూక్రు అప్పలస్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్వై నాయుడు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా అనేక పోరాటాలు చేస్తున్న తాతల కాలం నుండి సాగు చేస్తున్నటువంటి ఈ భూములకు పట్టాలు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు సర్వేలు చేసి పట్టాలు ఇవ్వకపోవడం వలన ఈ భూములను అన్యాక్రాంతం చేసేందుకు అనేకమంది ప్రయత్నం చేయడం చాలా బాధాకరమని ఎప్పటికైనా ఈ భూములను యుద్ధ ప్రాతిపదిక సర్వేలు జరిపి ఢీ పట్టాల మంజూరు చేయాలని, లేదంటే కుడుమూరు భూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా ప్రజలందరినీ కదిలించి ప్రజాసంఘాలను కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈరోజు నుండి 25వ తేదీ వరకు మూడు రోజులు పాదయాత్రలు కొనసాగుతాయని అనంతరం ఈనెల 28న ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించి సమస్త పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ. సమస్య పరిష్కార అయినంతవరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెంటనే స్పందించి పట్టాల పంపిణీ విషయంపై జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసి పరిష్కారం కోసం కృషి చేస్తారని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సూర్రు రామారావు మాట్లాడుతూ 48 సర్వేనెంబర్ భూములను 782 ఎకరాలను కబ్జా చేయాలని అనేక మంది కుట్ర పన్ను తున్నారని గిరిజలంతా ఐక్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్ర కుడుమూరులో ప్రారంభమై తోకమెట్ట మెట్టవలస, ఒడిశాల మడ, చీడి వలస, ఇప్పలవలస, వేటగాని వలస వరకు కొనసాగిందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారము అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు భూ పోరాట కమిటీ నాయకులు సుర్రుగంగయ్య, కొర్ర శ్రీనివాసరావు, గెమ్మెల గోపాల్, భీమారావు మాదల, జమ్మరాజు,తాడియ్య, సేవి రామయ్య , సేబి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

చిత్తూరు మన ధ్యాస సెప్టెంబర్-13: ఈరోజు ఉదయం 10 గంటలకు ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖ కార్యాలయంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “ఉపాధ్యాయులందరూ డాక్టర్ సర్వేపల్లి…

ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ, జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు గారు తెలిపారు. ఆయన శనివారం ప్రకాశం జిల్లా 39వ కలెక్టర్‌గా బాధ్యతలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

  • By JALAIAH
  • September 14, 2025
  • 2 views
ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

  • By JALAIAH
  • September 14, 2025
  • 3 views
రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన జనసేన నేత బుజ్జి…

నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన జనసేన నేత బుజ్జి…

బాల వికాస్ కేంద్రాల ద్వారా విలువలతో కూడిన విద్య – ఊరిమిండి వెంగలరెడ్డి

  • By JALAIAH
  • September 14, 2025
  • 4 views
బాల వికాస్ కేంద్రాల ద్వారా విలువలతో కూడిన విద్య – ఊరిమిండి వెంగలరెడ్డి

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక