భక్తితో కొలిస్తే కొంగుబంగారం వరాలు ఇచ్చే దేవుడు హనుమాన్

ఎస్ఆర్ పురం, మన న్యూస్: భక్తితో కొలిస్తే కొంగుబంగారం ఇచ్చే వరాల దేవుడు హనుమాన్ అని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ బాలాజీ నాయుడు అన్నారు గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా ఎస్ఆర్ పురం మండలం సింధూ రాజపురం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అలాగే ఆలయం ఆవరణంలో హనుమాన్ భక్తి పాటలు పాడారు అలాగే ఆలయం వద్ద కోలాటాలు భజనలు నిర్వహించారు అలాగే భక్తులందరికీపురుషోత్తం సోము అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అనన్య కాన్స్ట్రక్షన్ అధినేత గంగాధరం, బోడపాటి లోకనాథ నాయుడు, గొల్లపల్లి సుబ్రహ్మణ్యం నాయుడు రమేష్ నాయుడు సుబ్రహ్మణ్యం నాయుడు బ్రహ్మయ్య ఉమాపతి చంద్రశేఖర్ ఆంజనేయులు నాయుడు చుట్టుపక్కల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *