మన న్యూస్ సింగరాయకొండ:-

పాకల క్రాంతి నగర్, శాంతి నగర్ గ్రామాలలో మెరైన్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ కాపులు, ప్రజలతో సమావేశమై వేట నిషేధ సమయంలో వేటకు వెళ్లకూడదని, ఇది మత్స్య సంపద పెరుగుదలకు దోహదపడుతుందని వివరించారు.
అదేవిధంగా, సముద్ర తీర ప్రాంత గ్రామాలలో కొత్త వ్యక్తుల కదలికలు గమనిస్తూ ఉండాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1093 లేదా రామాయపట్నం CSPS కి తెలియజేయాలని సూచించారు. దేశ భద్రత దృష్ట్యా సముద్ర మార్గం ద్వారా టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా మత్స్యకారులు కోస్టల్ సెక్యూరిటీ పోలీస్‌కు సహకరించాలని, కోస్టల్ సెక్యూరిటీ పటిష్ఠంగా ఉంటే దేశం కూడా భద్రంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో CI G. శివన్నారాయణ, SI P. ఈశ్వరయ్య, HC M. శ్రీనివాసరెడ్డి, కానిస్టేబుళ్లు రాంబాబు, కోటేశ్వరరావు, సన్యాసిరావు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *