ఫేక్ న్యూస్ ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలి-ముమ్ముడి లక్ష్మణ్ కు న్యాయం చేయాలి

జెసి ని కలిసిన కాకినాడ సీనియర్ జర్నలిస్టులు,-కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన, ధర్నా

కాకినాడ కలెక్టరేట్ మే 21 మన న్యూస్ :-జర్నలిజంలో 20 సంవత్సరాలు పైబడి ఉన్న ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ ముమ్మిడి లక్ష్మణ్ పై పని కట్టుకొని అదే విధంగా సోషల్ మీడియా వివిధ రకాల మాధ్యమాలను వాడుతూ కొంతమంది విషప్రచారం చేస్తున్నారని, జర్నలిస్టుగా ఉన్నది ఉన్నట్టు రాస్తే ఇటువంటి ప్రచారాలు చేయడం ఎంతవరకు భావ్యమని కాకినాడ జిల్లా సీనియర్ జర్నలిస్టులు దుర్రాని, వాతాడ నవీన్ రాజ్, శివ నారాయణ రెడ్డి, కృష్ణంరాజు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్ కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ను బుధవారం కలిసి విన్నవించారు. పిఠాపురం నియోజకవర్గం ఎఫ్.కే పాలెంలో అక్రమ మట్టి తవ్వకాలకు సంబంధించి కథనాలు రాయడం వలన కొంతమంది అక్రమార్కులకు వాస్తవాలను రాయడంతో మట్టి మాఫియా కి సంబంధించిన వాళ్ళు ఫేస్ బుక్ ఇతర మాధ్యమాలను వాడుతూ అసభ్యకర పోస్టులను ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ ముమ్మిడి లక్ష్మణ్ పై ప్రతిరోజు అదే పనిగా పెడుతున్నారని జెసికి తెలియజేశారు. జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతినే విధంగా పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. దీనిపై స్పందించిన జెసి రాహుల్ మీనా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, కొంతమందిని కూడా గుర్తించడం జరిగిందని త్వరలోనే అరెస్టు చేయడం జరుగుతుందని జెసి రాహుల్ మీనా హామీ ఇచ్చారు. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ పిలుపుమేరకు అధిక సంఖ్యలో జర్నలిస్టులు వర్షానికి సైతం లెక్కచేయకుండా కలెక్టరేట్ కార్యాలయం వద్దకు చేరుకొని వర్షంలో నిరసన, ధర్నాను చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు దుర్రాని, వాతాడ నవీన్ రాజ్, శివ నారాయణ రెడ్డి, కృష్ణంరాజు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్ లు మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్టులపై ఇటువంటి ఫేక్ న్యూస్ లు ప్రచారం చేయడం తగదని, ఫేస్బుక్ ఇతర మాధ్యమాలలో అదేపనిగా విష ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇటువంటి పోస్ట్లు పెట్టడం మంచి పద్ధతి కాదని అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యకు సంబంధించిన వారిని అరెస్టు చేయగలరని డిమాండ్ చేస్తున్నామన్నారు. 20 సంవత్సరాల పైబడి జర్నలిజంలో ఉన్న ముమ్మిడి లక్ష్మణ్ పై ఇటువంటి ఆరోపణలు గతంలో ఎప్పుడు రాలేదని, ప్రజాశక్తి ఉన్నత విలువలకు నిదర్శనంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వీధి గోపీనాథ్, మంగ వెంకట శివరామకృష్ణ, చైతన్య కృష్ణ, మేకల వెంకటరమణ, చిస్టీ, పుర్రె త్రినాద్, రాజు, దొరబాబు, వెంకట రమణ, మాధన్, ముమ్మిడి లక్ష్మణ్, దుళ్ళ శ్రీధర్, గణపతి, శ్రీధర్, రాజ్ కమల్, సత్య, రెడ్డి, వినయ్, శ్రీను, అడప సతీష్, ఫరక్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా