

వెదురుకుప్పం, మన న్యూస్:చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ సి. దివాకర్ రెడ్డికి తుడా చైర్మన్ పదవి లభించిన సందర్భంగా, వెదురుకుప్పం రెడ్డి సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ బాధ్యతను అప్పగించడాన్ని గౌరవంగా భావించిన సంఘం నాయకులు, వారిద్దరికి కృతజ్ఞతలు తెలియజేశారు.డాలర్స్ గ్రూప్ అధినేత, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అయిన డాక్టర్ సి. దివాకర్ రెడ్డి తన ఆఫీస్‌లో తిరుపతిలో వారిని కలసిన సందర్భంగా, సంఘం నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, పూలమాలలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో బండి దామోదర్ రెడ్డి (రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు), పట్నం సురేందర్ రెడ్డి, కామసాని బాలకృష్ణారెడ్డి, ఎక్స్ ఆర్మీ కామసాని దేవరాజు రెడ్డి, బండి విజయకుమార్ రెడ్డి, కంబాలచేను జితేందర్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, బండి రోసి రెడ్డి, అన్న రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ప్రజా టీవీ రిపోర్టర్ పి. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.