“వృశ్చికం” చిత్ర పాటల రికార్డింగ్ ప్రారంభం !!!

Mana News :- శ్రీరామ్ ఫిలిమ్స్ సమర్పణ లో మంగపుత్ర, యశ్విక జంటగా నటిస్తున్న సినిమా “వృశ్చికం”. ఈ చిత్రాన్ని శ్రీ ఆద్య నిర్మాణం బ్యానర్ పై శివరామ్ నిర్మిస్తున్నారు. మంగపుత్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో “వృశ్చికం” సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్ర హీరో, దర్శకుడు మంగపుత్ర 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు, నటుడిగా పవన్ కల్యాణ్ గారి జల్సా, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ మూవీస్ తో పాటు బాహుబలి 1, 2 చిత్రాల్లో నటించారు. రాజమౌళి గారిని చూసి ఆయన దర్శకత్వానికి ఏకలవ్య శిష్యుడిగా మారారు. వృశ్చికం మూవీతో హీరోగా నటిస్తూ దర్శకుడిగా మారారు.ఈ చిత్ర పాటల రీ రికార్డింగ్ ప్రారంభం అయ్యింది, ప్రమోద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ రచయితలు ఈ సినిమా కోసం సాహిత్యం అందిస్తున్నారు.ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకోబోతోంది. 3 షెడ్యూల్స్ లో 45 రోజుల్లో సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రామచంద్రాపురం, ,మోతు గూడెం,హైదరాబాద్ లో షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. మంగపుత్ర, యశ్విక, క్రాంతి బలివాడ, కోర్టు శ్రీనివాస్, మంజు ఆర్య, రవి, కోసూరి సుబ్రహ్మణ్యం, తదితరులు నటించిన ఈ సినిమాకు ఆర్ట్ : సముద్రాల రవిచంద్ర, మేకప్ – రఘు, మాటలు,: T. ఆనంద్ కృష్ణ, కాస్ట్యూమ్స్: తిరుమల, మ్యూజిక్ : ప్రమోద్, డీవోపీ: రాజ్ కె దిలీప్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రమణ కుమార్, స్టిల్స్ : పాలా.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఇ. శ్రీరామ్ గౌడ్, కో ప్రొడ్యూసర్ : తాండ్ర గోపాల్, సమర్పణ – గంగాధర్ రెడ్డి, ప్రొడ్యూసర్ – శివరామ్, రచన దర్శకత్వం: మంగపుత్ర.

Related Posts

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

మన న్యూస్ : బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి