• డిసెంబర్ 4 మహా సన్నిధానం పూజా మహోత్సవానికి సంబంధించిన…
  • 86వ వార్డ్ కార్పొరేటర్ కాకీ గోవిందరెడ్డి చేతుల మీదట గోడ పత్రిక ఆవిష్కరణ..

గాజువాక మన ధ్యాస ప్రతినిధి నవంబర్ 28:శ్రీ సంతోష్ మాత అయ్యప్ప స్వామి ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహోత్సవానికి తుంగలం గ్రామంలోనే శ్రీకారం చుట్టడం విశేషం.గవర జగ్గయ్యపాలెం గ్రామంలో డిసెంబర్ 4న జరగనున్న మహా సన్నిధానం పూజా మహోత్సవానికి సంబంధించిన గోడపత్రికను 86వ వార్డు కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి తుంగలం గ్రామంలో ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా 86 వార్డ కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 4న జగ్గయ్యపాలెంలో జరగనున్న ఈ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.మహా సన్నిధానం పూజా మహోత్సవం విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. శ్రీ సంతోషిమాత అయ్యప్ప స్వామి భక్తులు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించి ఆధ్యాత్మిక చింతనతో కూడిన ఏర్పాటు చేస్తున్నా చాలా సంతోషకరం ప్రజల యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమంలో రాజేష్ స్వామి, పైడ్రాజు స్వామి,అప్పలరెడ్డి స్వామితో పాటు తుంగలం శ్రీ సంతోష్ మాత అయ్యప్ప స్వామి సభ్యులు,గ్రామ పెద్దలు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *