- పని చేయడం చంద్రబాబు బ్రాండ్,స్టిక్కర్లు అంటించడం జగన్ బ్రాండ్-ఎమ్మెల్యే గణబాబు ఫైర్!
మంగళగిరి మన ధ్యాస ప్రతినిధి నవంబర్ 29:కనీసం పోర్టుకి, ఎయిర్‌పోర్టుకి మధ్య ఉన్న తేడా కూడా తెలియని వైసీపీ నేతలు ఈరోజు పోర్టుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు (గణబాబు) ధ్వజమెత్తారు.ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.సుదీర్ఘ సముద్ర తీరాన్ని సంపద సృష్టికి కేంద్రంగా మార్చి,రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు యువతకు భారీగా ఉపాధి కల్పించడమే లక్ష్యమని తెలిపారు.రామాయపట్నం పోర్టుపై కీలక వ్యాఖ్యలు 2014-19 మధ్యే చంద్రబాబు ప్రభుత్వం రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టుకు అన్ని అనుమతులు తెచ్చి,2019లోనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిందని గణబాబు గుర్తు చేశారు.జగన్ ప్రభుత్వం ప్రచారం కోసం 2022లో మళ్లీ భూమిపూజ పేరుతో రెండోసారి శంకుస్థాపన చేసిందని,ఐదేళ్లలో పోర్టు కట్టలేదు కానీ ప్రాజెక్టు వ్యయం పెంచి రూ.3,938 కోట్ల అదనపు అప్పు భారాన్ని మోపిందని ఆరోపించారు.గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను లేకుండా చేసి పూర్తిగా ప్రైవేటు సంస్థకు ధారాదత్తం చేశారని విమర్శించారు. ఇలా రాష్ట్రానికి తీరని నష్టం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ‘క్రెడిట్ చోరీ’ అంటూ మాట్లాడటం సరికాదన్నారు.రామాయపట్నం పనులు 84% పూర్తి2026 నవంబర్ 16న కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ నెం.93 ద్వారా రామాయపట్నం పోర్టుకు కస్టమ్స్ క్లియరెన్స్ హోదా దక్కిందని, అక్టోబర్ 27న పర్యావరణ అనుమతులు పొందిన రూ.1.27 లక్షల కోట్ల బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టుతో పోర్టును అనుసంధానిస్తూ ఒప్పందం కుదిరిందని తెలిపారు.కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు వేగంగా జరిగి ఇప్పటివరకు 84% పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ఆర్థిక పురోగతి రూ.1,796.65 కోట్ల నుంచి రూ. 3,476 కోట్లకు (85.67%) చేరిందని,బ్రేక్ వాటర్స్ 99.12%,బెర్త్‌ల నిర్మాణం 97.60%,5.5 కి.మీ. ఫోర్-లైన్ రోడ్డు 81% పూర్తయ్యాయని వివరించారు.రాష్ట్రంలో రూ.15,000 కోట్ల వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు.రామాయపట్నం 84%, మూలపేట 76.13%, మచిలీపట్నం 60%, కాకినాడ గేట్‌వే 33%, జువ్వలదిన్నె 97.98%, ఉప్పాడ 86.15%, నిజాంపట్నం 81.61%, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ 71.90% పూర్తయ్యాయని తెలిపారు.*పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్న ఏపీ:*చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ చొరవతో ఏపీ పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాల్లో పరుగులు పెడుతోందని,ఈ అభివృద్ధిని చూసి తట్టుకోలేక వైసీపీలో అభద్రతా భావం మొదలైందన్నారు.2014-19లో భూసేకరణ, అనుమతులు పూర్తి చేయడం వల్లే హెచ్‌పీసీఎల్ విస్తరణ సాధ్యమై, శుద్ధి సామర్థ్యం 90 లక్షల నుంచి 1.5-1.6 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగి, 10 వేల మందికి ఉపాధి లభించిందని గుర్తు చేశారు.కూటమి ప్రభుత్వం 30కి పైగా పారిశ్రామిక పాలసీలు తీసుకురావడంతో దేశ, విదేశీ ఇన్వెస్టర్లు ఏపీ వైపు చూస్తున్నారని, స్థానిక సంస్థల్లోనే వైసీపీ గ్రాఫ్ 10% పడిపోయిందని గణబాబు పేర్కొన్నారు.



