కూర్మన్నపాలం మన ధ్యాస ప్రతినిధి నవంబర్ 28:జీవీఎంసీ 99 వార్డు పరిధిలో గల దుగ్గపువాని పాలములో వెలిసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ దానప్ప తల్లి అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి కి పూలతో అలంకరించి మరియు అరటిపళ్ళు గేలలతో అమ్మవారు ఆలయానికి తోరణాలుగా అలంకరించారు మరియు ముర్రాట,సారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.కాలనీలో ఉన్న వడ్లపూడి,కణితి దుగ్గపువానిపాలెం,కాశీ పాలెం,సంతమామిడి తోట, ఆప్పికొండ ,లక్ష్మీపురం,కాలనీలో ఉన్న భారీగా గ్రామ ప్రజలకు భక్తులకు చేరుకొని శ్రీ దానప్ప తల్లి అమ్మవారి సారే,ముర్రాట కార్యక్రమాలు భారీ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.ఈ ఉదయం నుంచి అమ్మవారికి పూజలు జలాభిషేకాలు కుంకుమ పూజలు మురాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అనంతరం సారి అమ్మవారికి చూపించడం జరిగింది.ఈ ఒక్క సారిని భక్తులకు ప్రజలకు తీసుకొచ్చిన సారిని పంచిపెట్టారు అనంతరం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి,చింతలపూడి వెంకటరామయ్య,గాజువాక వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి,101 వ వార్డు వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం భారీ అన్న సమారాధన ప్రారంభించారు ఆలయ కమిటీ ప్రతినిధులు అలాగే ఉదయం 5 గం||నుంచి పూజా కార్యక్రమం నిర్వహించారు కావున అమ్మవారు ఆశీస్సులు తీసుకోవాలని ప్రజలు భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమాలన్నిటిని దానప్ప తల్లి ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *