

ఉదయగిరి మన న్యూస్ : ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి మండలం వెంజట్రావు పల్లి లో బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపి, బెల్ట్ పై తాటతీయాలని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంగళవారం ఉదయగిరి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వి పి ఆర్ అమృత ద్వారా వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారని గ్రామ మహిళలు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అక్కడ ఉన్న అధికారులను పిలిచి ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకొని తాట తీయాలని ఆదేశాలిచ్చారు. ఆదేశాలు అందుకున్న అధికారులు బెల్ట్ నిర్వహణపై ఆరా తీస్తున్నారు. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి అభినందనలు తెలియజేశారు.