ప్ర‌ధాని కి దైవ‌బ‌లం మెండుగా ఉండాల‌ని ప్రార్థించాఃఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తిః- ఆప‌రేష‌న్ సింధూర్ ద్వారా పాకిస్థాన్ కు గుణ‌పాఠం నేర్పిన సైనికులకు, దేశాన్ని ఏక‌తాటిపై నిలిపిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదికి తిరుత్తుణి సుబ్ర‌మ‌ణ్య స్వామి ఆశిశ్శీలు మెండుగా ఉండాల‌ని ప్రార్థించిన‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. సైనికుల‌కు, దేశ నాయ‌క‌త్వానికి దైవ‌బ‌లం తోడుగా ఉండాల‌ని ష‌ష్ఠ షణ్ముక ఆల‌యాల్లో పూజ‌లు చేయాల‌ని జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆదేశించ‌డంతో తిరుత్తుణి సుబ్ర‌మ‌ణ్య స్వామి ఆల‌యంలో మంగ‌ళ‌వారం ఉద‌యం ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పూజ‌లు నిర్వ‌హించారు. పూజ‌ల అనంత‌రం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప‌హ‌ల్గాంలో 26మంది యాత్రికుల‌ను ఉగ్ర‌వాదులు హ‌త‌మార్చిన తీరు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లిచి వేసింద‌న్నారు. ఆయుధ‌సంప‌త్తి, సాంకేతిక ప‌రిజ్జానం సైనికుల‌కు ఉన్నా దైవ‌బ‌లం ఉండాల‌నే సంక‌ల్పంతో ష‌ష్ట ష‌ణ్ముక ఆల‌యాల్లో జ‌న‌సేన ప్రజాప్ర‌తి నిధులు మంగ‌ళ‌వారం పూజ‌లు నిర్వ‌హించి ప్రార్థించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. సైనికుల‌తో పాటు, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై దైవ‌బలం మెండుగా ఉండాల‌ని తిరుత్తుణి సుబ్ర‌మ‌ణ్య స్వామిని మొక్కుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. దేశ‌ర‌క్ష‌ణ కోసం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తీసుకునే నిర్ణ‌యాల‌ను జ‌న‌సేన బ‌ల‌ప‌రుస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌న‌సేన నాయ‌కులు తాతినేని వెంక‌టేశ్వ‌ర రావు, ఎస్సీ కార్పోరేష‌న్ డైర‌క్ట‌ర్ యుగంధ‌ర్, వ‌న్నెకుల క్ష‌త్రియ కార్పోరేష‌న్ డైర‌క్ట‌ర్ బాల‌సుబ్ర‌మ‌ణ్యం, కార్పోరేట‌ర్లు న‌ర‌సింహాచ్చారి, న‌రేంద్ర‌, జ‌న‌సేన కార్పోరేట‌ర్లు ఎస్కే బాబు, సికే రేవ‌తి, దూది కుమారి, పొన్నాల చంద్ర, కుడితి సుబ్ర‌మ‌ణ్యం, వ‌రికుంట్ల నారాయ‌ణ‌, తిరుత్తుణి వేణుగోపాల్, దూది శివ కుమార్, యాద‌వ కృష్ణా, సికె రవి, రాజా రెడ్డి, హరిశంక‌ర్, ఆకేపాటి సుభాషిణి, కీర్త‌న‌, ఆకుల వ‌న‌జ‌, బాబ్జి, కెఎంకే కుమార్, ఆర్కాట్ కృష్ణ‌ప్ర‌సాద్, ప‌గ‌డాల ముర‌ళీ, రాజేష్ యాద‌వ్, సుధాక‌ర్, న‌గ‌రి పిఓసి మెరుపుల మ‌హేష్త‌, ల‌క్ష్మీప‌తి, మున‌స్వామి, రాజేష్ ఆచ్చారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///