

మన న్యూస్, తిరుపతి:- తిరుపతిలో శ్రీ శ్రీ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవంలో మాజీ మంత్రి శ్రీమతి.ఆర్కె రోజా గారు మంగళవారం పాల్గొని. జాతర మహోత్సవంలో భాగంగా ఎనిమిదవ రోజు గంగమ్మ తల్లి అమ్మవారికి సాంప్రదాయబద్దంగా పట్టు వస్త్రాలు సారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా రోజా గారు తాను పుట్టిపెరిగిన ఊరు.. చిన్నతనం నుంచి ఇప్పటివరకు ఇక్కడ అమ్మవారి గుడికి వస్తుంటానని, ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర మహోత్సవంలో అమ్మవారి ఆలయ మహద్వారం నుంచి పసుపు, కుంకుమ, గాజులు, చీర, రవిక పూలమాలలతో కూడిన సారెను నెత్తిన పెట్టుకొని పార్టీ నేతలతో కలిసి ఆయల ప్రదక్షిణ చేసి అమ్మవారికి సారెను సమర్పించారు. అనంతరం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.గంగమ్మ జాతర రోజు న ప్రత్యేక అలంకారము లో శ్రీ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి అమ్మవారి దర్శనమిచ్చారు. ఆలయ పండితులు దర్శనం అనంతరం వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
