మన న్యూస్ ,నెల్లూరు రూరల్ ,మే 9:– నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చొరవతో కొండాయపాలెం గేట్, బి.వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జీలకు తొలి అడుగు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు కొండాయపాలెం గేట్, బి.వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జీలను పర్యవేక్షిస్తున్నారు. జూన్ నెలాఖరులోపు రైల్వే అండర్ బ్రిడ్జీలకు టెండర్లు పూర్తికి రైల్వే అధికారుల హామీ. ఆశాభావం వ్యక్తం చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. స్థానిక శాసనసభ్యుడిగా రైల్వే అండర్ బ్రిడ్జీల కోసం నా శక్తికి మించి కృషి చేస్తున్నా. నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో కొండాయపాలెం గేట్, బి.వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జీలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.కొండాయపాలెం గేట్, బి.వి. నగర్ వాసుల దశాబ్దాల కల నెరవేరబోతుంది అనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పటికప్పుడు కొండాయపాలెం గేట్, బి.వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జీలను పర్యవేక్షిస్తున్నారు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. జూన్ నెలాఖరులోపు రైల్వే అండర్ బ్రిడ్జీలకు టెండర్లు పూర్తికి రైల్వే అధికారుల హామీ,దేవుడు దయతలిస్తే జూన్ నెలాఖరులోపు టెండర్లు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేసిన అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. స్థానిక శాసనసభ్యుడిగా రైల్వే అండర్ బ్రిడ్జిల కోసం నా శక్తికి మించి కృషి చేస్తున్నా అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో ఎట్టి పరిస్థితుల్లో కొండాయపాలెం గేట్, బి.వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జీలను సాధిస్తాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
