విజయ వంతంగా ముగిసిన ఎన్ సి సి నేవల్ క్యాంపు

మన న్యూస్, నెల్లూరు ,మే 7:– 10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి, నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే అధ్యక్షతన జరిగిన యన్ సి సి యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్-3 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని సరస్వతి నగర్ అక్షర విద్యాలయ నందు గత పది రోజులుగా జరిగిన క్యాంపును జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ సందర్శించారు. నిన్న సాయంత్రం కేడేట్లు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి పులకించి వివిధ విభాగాలలో ప్రతిభ కన బరచిన ఎన్ సి సి కేడేట్లకు ప్రతిభా ధ్రువీకరణ పత్రాలు,జ్ఞాపికలు ప్రదానం చేసి అభినందనలు తెలిపారు. అనంతరం కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ ఎన్సీసీలో చేరే అవకాశం అందరికీ రాదని ఎన్సిసి లో చేరినందుకు మీరు అదృష్టవంతులని ఎన్సీసీలో చేరడం వల్ల విద్యార్థుల్లో దేశభక్తి సామాజిక సేవ నాయకత్వ లక్షణాలు పోరాటపటిమ సేవా భావం తదితర ఎన్నో మంచి లక్షణాలు అలవాడతాయని తద్వారా ఉత్తమ పౌరులుగా ఎతగడానికి ఎన్సీసీ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని ఈ పది రోజులపాటు జరిగినటువంటి శిక్షణలో ఇటువంటి మరెన్నో విషయాలను మీరు తెలుసుకుని ఉంటారని విద్యార్థుల్లో జాతీయ సమగ్రతను పెంపొందించడానికి ప్రతి పాఠశాలలో ఎన్సిసిని ప్రవేశపెడతామని అన్నారు. అనంతరం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ యతి రాజ్, క్యాంప్ కమాండెంట్ గణేష్ గొదంగవే క్యాంప్ అడ్జటెంట్ గుండాల నరేంద్ర బాబు ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్సిసి క్యాడేట్ల తో కలిసి విందును ఆరగించారు. పది రోజుల ఎన్సిసి క్యాంపు ముగింపు సందర్భంగా క్యాంపు కమాండెంట్ గణేష్ గొదం గవే డ్రిల్లు, ఫైరింగ్, రాత పరీక్ష, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ కనపరిచిన కేడేట్లకు సర్టిఫికెట్లు, ట్రోఫీలు అందజేసి అభినందించారు. భవిష్యత్తలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఎన్సిసి క్యాంపు అడ్జటెంట్ ఆఫీసర్ గుండాల నరేంద్ర బాబు,థర్డ్ ఆఫీసర్లు మస్తానయ్య, కొండారెడ్డి,విద్యా సాగర్, అరోరా, సాయి శంకరి,దివ్య, పి ఐ స్టాఫ్ వైకుంఠం చీఫ్ ఇన్స్ట్రక్టర్, పెట్టీ ఆఫీసర్లు రంజన్, లోకేష్, లక్ష్మణ్, దీపక్,వెంకటేష్, రమణారావు, నవీన్, ఆఫీస్ సూపరింటెండెంట్ ముకుంద సాగర్, షిప్ మోడలింగ్ ఇన్స్ట్రక్టర్ ఎస్. వి. రామన్, కార్యాలయ సిబ్బంది షెహనాజ్ బేగం, కల్పన, సుజాత, వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన 600 మంది ఎన్ సి సి కేడేట్లు
పాల్గొన్నారు.

Related Posts

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా