

వెదురుకుప్పం, మే 7 (మన న్యూస్):– వెదురుకుప్పం మండలంలోని మెండివెంగనపల్లి గ్రామంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత ఆచార్య బండి రామకృష్ణారెడ్డి కర్మక్రియలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై, ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ, వారి సేవలను స్మరించుకున్నారు. కార్వేటినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. సీత విజయలక్ష్మీ రెడ్డి, ప్రఖ్యాత విద్యావేత్త డా. ఎస్. దయాకర్ రెడ్డి, టీడీపీ వెదురుకుప్పం క్లస్టర్ ఇంచార్జి మోహన్ మురళి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వరప్రసాద్, మొండివెంగనపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, యువ నాయకుడు నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు, ఆచార్య రామకృష్ణారెడ్డి చేసిన సేవలను కొనియాడారు. విద్యార్థులకు మార్గదర్శకుడిగా, సమాజానికి జ్ఞానదాయకుడిగా ఆయన చిరస్థాయిగా గుర్తుండిపోతారని అన్నారు. స్థానిక ప్రజలు, శిష్య పరంపర, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.