

*శంఖవరం మన న్యూస్ (అపురూప్): జన సైనికులకు జనసేన పార్టీ క్రియ వాలంటరీల సభ్యత్వం అండగా నిలుస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి) పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం రాఘవేంద్ర రెసిడెన్సీలో జనసేన పార్టీ క్రియా వాలంటీర్లకు సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచి వచ్చిన పార్టీ ప్రతినిధులు అక్షయ్, సాయి సమక్షంలో మంగళవారం రాత్రి పార్టీ సభ్యత్వం చేసిన క్రియా వాలంటీర్లకు సభ్యత్వ కిట్లు పంపిణీ చేయడం జరిగిందని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబీ),జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు,జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యుడు కరణం సుబ్రహ్మణ్యం, మండల పార్టీ అధ్యక్షుడు గాబు సుభాష్ అన్నారు. ఈ సందర్భంగా జనసేన నేతలు మాట్లాడుతూ, నియోజకవర్గంలో 76 మంది క్రియాశీలక సభ్యత్వం చేసిన వాలంటీర్లు ఉన్నారని వారు నమో చేసిన 9000 కి పైగా సభ్యత్వం కిట్లను వారికి మాత్రమే అందజేయడం జరుగుతున్నదని, క్రియా వాలంటీర్లు అందరూ కూడా తప్పకుండా వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ప్రతి ఒక్క జన సైనికుడికి ఐడి కార్డులు సకాలంలో పంపిణీ చేయాలని అన్నారు. భవిష్యత్తులో సభ్యత్వం తీసుకున్న ప్రతి జనసైనికుడికి కేంద్ర కార్యాలయం నుంచి ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా సమాచారం అందజేయడం జరుగుతున్నదని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు మండల పార్టీ అధ్యక్షుడు రామకుర్తి కామేష్, వీర మహిళ దలే జ్యోతి, ప్రత్తిపాడు మండల ఉపాధ్యక్షుడు శీరం శ్రీను,గంగిరెడ్ల మణికంఠ, పలివెల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.