మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండల కేంద్రంలో ఆదివారం మహాశివరాత్రి మెగా వైద్య శిబిరం
మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులను అందించారు. నిర్వాహకులు ఉచితంగా సేవలు అందించారు.ఈ సందర్భంగా యూపీహెచ్సి డాక్టర్ ఎం సౌభాగ్య సరోజ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వధినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు ప్రత్తిపాడు శాసనసభ్యులు వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఏలేశ్వరం యూపీహెచ్సి డాక్టర్ ఎం సౌభాగ్య సరోజ పర్యవేక్షణలో తెల్లవారు జాము 4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ పల్లపు వీధి రామాలయంవద్ద మరియు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం,అప్పనపాలెం బ్రిడ్జి వద్ద మూడు వైద్య శిబిరాలను మూడు షిఫ్ట్ లలో 40మంది సిబ్బందితో మూడు వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 486 మందికి ఈ శిబిరాల ద్వారా వైద్యచికిత్సలు అందిoచి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు ఎస్ వి రమణ, ఎస్ విజయలక్ష్మి,ఏఎన్ఎం లు,హెల్త్ సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్స్,ఆశాలు,యు సి హెచ్ సి
సిబ్బంది పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *