

మన న్యూస్, సర్వేపల్లి ,మే 5:– వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో సోమవారం ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సాఫ్ట్ బాల్ మెన్ టోర్నమెంట్ ను ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు ప్రారంభించినారు. శాప్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సర్వేపల్లి నియోజకవర్గానికి వచ్చిన రవినాయుడికి ఆత్మీయ స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ సునీత, టీడీపీ నాయకులు రావూరి రాధాకృష్ణమ నాయుడు, కుంకాల దశరథనాగేంద్ర ప్రసాద్, కట్టంరెడ్డి రాధాకృష్ణారెడ్డి, కాకర్ల తిరుమల నాయుడు, అమల్లా తదితరులు పాల్గొన్నారు.
*దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ క్రీడాపాలసీ.
*పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.
*స్కూలు స్థాయిలోనే విద్యార్థులు క్రీడల్లో రాణించేలా విప్లవాత్మక మార్పులు.