కనిగిరి రిజర్వాయర్ నుంచి రెండో పంటకు నీటి విడుదల……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,కోవూరు, మే 4:సాగునీటి సంఘ అధ్యక్షులు మరియు ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో ఆయకట్టు పరిధిలోని చివరి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేయాలి.నీటి వృధాని అరికట్టి నీళ్లు పొదుపుగా వినియోగించండి.పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా వుండాలి.నీటి విడుదల సందర్భముగా వరుణుడు కరుణించి వర్షం పడడం శుభసూచకం-ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో రైతులు సుభిక్షంగా వున్నారన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సందర్భంగా కోవూరు నియోజకవర్గ రైతాంగ నారుమళ్ల అవసరాల కోసం ఆమె కనిగిరి రిజర్వాయర్ క్రస్ట్ గేట్లుఎత్తి ఈస్ట్రన్ ఛానల్ మరియు సదరన్ ఛానల్స్ కు నీళ్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…….. కనిగిరి రిజర్వాయర్ నుంచి నీటి విడుదల సందర్భముగా వరుణుడు కరుణించి వర్షం పడడం శుభ సూచకమన్నారు. గత సంవత్సరం కోవూరు నియోజకవర్గ రైతులు అధిక దిగుబడులు సాధించడం సంతోషంగా వుందన్నారు.గిట్టుబాటు ధరతో పాటు గతమెన్నడూ లేని విధంగా ధాన్యం అమ్మిన 24 గంటలలోనే హమాలీ చార్జీలతో సహా రైతుల ఖాతాలలో జమ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఆమె ధన్యవాదాలు తెలియచేసారు.
తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన 11 నెలల వ్యవధిలో కనిగిరి రిజర్వాయర్ నుంచి రెండు సార్లు నీళ్లు విడుదల చేయడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కనిగిరి రిజర్వాయర్ లో ప్రస్తుతం 2. 7 TMC ల నీళ్లు వున్నాయని రెండో పంటకు ఎటువంటి యిబ్బంది రాదన్నారు. ఇరిగేషన్ అధికారులు, సాగునీటి సంఘ అధ్యక్షులు పరస్పర సమన్వయంతో చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు కృషి చేయలన్నారు. నీటి వృధాని అరికట్టి నీళ్లు పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించారు. దేవుడు అనుగ్రహంతో పంటలు బాగా పండి కోవూరు నియోజకవర్గ రైతులు సుభిక్షంగా వుండాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెన్నాడెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాలరెడ్డి, ఇరిగేషన్ ఎ ఇ మరియు డి ఇ లు ఎన్ వెంకట ప్రసాద్, వై పెంచలయ్య, బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, కౌన్సిలర్లు పుట్టా లక్ష్మీకాంతమ్మ, లలితమ్మతాళ్ల వైష్ణవి, చీర్ల ప్రసాద్, పలువురు నీటి సంఘ అధ్యక్షులు డైరెక్టర్లతో పాటు టిడిపి నాయకులు బత్తల హరికృష్ణ, ఎంవి శేషయ్య, శివయ్య నాయుడు, యర్రంరెడ్డి గోవర్ధనరెడ్డి, చెముకుల కృష్ణ చైతన్య, సూరా శ్రీనివాసులు రెడ్డి ఏటూరి శివరామక్రిష్ణా రెడ్డి, మోర్ల మురళి,పటేల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

కఠోరమైన దీక్ష, మహర్షి భగీరధుని త్యాగం మరువలేనిది.

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన భగీరథ మహర్షి జయంతిని జరుపుకోవడం సంతోష దాయకమని శంఖవరం మండల అధ్యక్షుడు పర్వత రాజబాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన…

మహర్షి భగీరథుని త్యాగం, దృఢనిశ్చయం మన సంప్రదాయానికి గొప్ప ముద్ర…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : భగీరథ మహర్షి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నిర్వహణ కార్యదర్శి పర్వత సురేష్ శుభాకాంక్షలు తెలిపారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం స్థానిక సగర కాలనీ సమీపంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కఠోరమైన దీక్ష, మహర్షి భగీరధుని త్యాగం మరువలేనిది.

కఠోరమైన దీక్ష, మహర్షి భగీరధుని త్యాగం మరువలేనిది.

మహర్షి భగీరథుని త్యాగం, దృఢనిశ్చయం మన సంప్రదాయానికి గొప్ప ముద్ర…

మహర్షి భగీరథుని త్యాగం, దృఢనిశ్చయం మన సంప్రదాయానికి గొప్ప ముద్ర…

స్టార్ బేకరీ అండ్ కేఫ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..;!

స్టార్ బేకరీ అండ్ కేఫ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..;!

ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి: మహిళా పోలీస్ కీర్తి

ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలి: మహిళా పోలీస్ కీర్తి

డిసిసిబి చైర్మన్‌కు టిడిపి సీనియర్ నేతల శుభాకాంక్షలు