

మన న్యూస్,తిరుపతి, :-తిరుపతి పల్లి వీధిలోని వేషాలమ్మ జాతర పోస్టర్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి, శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడి ఉత్సవ కమిటీ సభ్యులు మబ్బు దేవనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆదివారం మబ్బు దేవ నారాయణ రెడ్డి కార్యాలయంలో వేషాలమ్మ గుడి ఇరికి ముని శేఖర్ రెడ్డి, తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ ఆర్ ముని రామయ్య లు వేషాలమ్మ జాతరను పురస్కరించుకొని పోస్టర్ ను మబ్బు దేవ నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. వేషాలమ్మ జాతర ఈనెల ఆరో తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనుంది. ఇప్పటికే వేషాలమ్మ ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నట్లు ఆలయ ఈవో ఇరికి మునిశేఖర్ రెడ్డి తెలిపారు.