విద్య, ఉద్యోగాలలో క్రీడాకారులకు 3% శాతం రిజర్వేషన్..35 ఏళ్ల క్రీడాకారుల క‌ల‌ను 35 రోజుల్లోనే నెర‌వేర్చాం -శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు

మన న్యూస్,తిరుప‌తి, :– టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్రీడాకారులకు విద్య ఉద్యోగాలలో మూడు శాతం రిజర్వేషన్ కల్పించారని రాష్ట్ర క్రీడా ప్రాణాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు తెలిపారు. శనివారం శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహించిన సమ్మర్ క్యాంపు క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని ముఖ్యఅతిథిగా విచ్చేసిన షాప్ చైర్మన్ రవి నాయుడు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ క్రీడ‌ల్లో గెలుపోట‌ములు స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని, కానీ క్రీడ‌ల కార‌ణంగా క్రీడాకారుడికి చేకూరే శారీర‌క‌, మాన‌సిక స్థైర్యం అసాధార‌ణ‌మ‌ని శాప్ ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు పేర్కొన్నారు. గ‌తంలో మెడ‌ల్స్‌ సాధించిన క్రీడాకారుల‌కు సైతం వారి భ‌విష్య‌త్తు ప‌ట్ల అభద్ర‌తా భావం ఉండేద‌ని, కానీ నేడు ఆ ప‌రిస్థితి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లేద‌న్నారు. ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబునాయుడు క్రీడాకారులకు జీవిత భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తూ ప్ర‌భుత్వ కొలువుల్లో రాత‌ప‌రీక్ష లేకుండా సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాన్ని తీసుకుని బంగారు భ‌విష్య‌త్తుకు బాట‌లు వేశార‌న్నారు. ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు సంబంధించి ఇక‌పై ఏ నోటిఫికేష‌న్ విడుద‌లైనా రాత ప‌రీక్ష లేకుండా క్రీడాకారులు సాధించిన‌ మెడ‌ల్స్‌, వారి ప్ర‌తిభ ఆధారంగానే ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేందుకు కూట‌మి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ప‌నిచేస్తుంద‌న్నారు. 35 ఏళ్ల క్రితం ప‌లువురు క్రీడాకారులు రాత‌ప‌రీక్ష లేకుండా ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవ్వాల‌ని దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ దృష్టికి తీసుకొచ్చార‌ని గుర్తు చేశారు. ఇదే విష‌యాన్ని ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబునాయుడు, విద్యాశాఖామంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి 35 ఏళ్ల క్రీడాకారుల క‌ల‌ను 35 రోజుల్లోనే సాకారం చేశామ‌న్నారు. రాష్ట్రానికి, దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచే క్రీడాకారుడికి గౌర‌వం ఇవ్వాల‌నే ఉద్దేశంతో స్పోర్ట్స్ కోటా కింద 3శాతం హారిజంట‌ల్ రిజ‌ర్వేష‌న్ విధానాన్ని తీసుకొచ్చామ‌న్నారు. స్పోర్ట్స్ కోటా కింద 3శాతం హారిజాంట‌ల్ రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయ‌డం చారిత్రాత్మ‌క నిర్ణ‌యమ‌న్నారు. దేశ గౌర‌వాన్ని, రాష్ట్ర గౌర‌వాన్ని పెంపొందించే క్రీడాకారుల‌కు స‌ముచిత‌స్థానం క‌ల్పించాల్సిన బాధ్య‌త త‌మ‌పై ఉంద‌ని చెప్పారు. ముఖ్యంగా క్రీడాకారుల‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా అత్యుత్త‌మ క్రీడావ‌స‌తుల‌ను క‌ల్పించేందుకు క్రీడావ‌స‌తుల‌ను క‌ల్పించేందుకు క్రీడాప్రాధికార సంస్థ కృషి చేస్తుంద‌న్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా క్రీడల ప‌ట్ల ఆస‌క్తి ఉన్న‌వారి కోసం క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వ‌ర్యంలో స‌మ్మ‌ర్ కోచింగ్ క్యాంపులు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. అలాగే శాప్ క‌ల్పిస్తున్న క్రీడాస‌దుపాయాల‌ను స‌ద్వినియోగం చేసుకుని క్రీడాకారులు మ‌రింత మెరుగ్గా రాణించి క్రీడ‌ల్లో అత్యున్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో తిరుప‌తి, చిత్తూరు జిల్లాల డీఎస్డీఓలు స‌య్య‌ద్ సాహెబ్‌, బాలాజీ, ఫిజికల్ డైరెక్టర్లు, వివిధ క్రీడా సంఘాల కోచ్ లు టీఎన్ఎస్ఎఫ్ తిరుప‌తి జిల్లా అధ్య‌క్షులు కొట్టే హేమంత్ రాయ‌ల్‌, శాప్ కోచ్‌లు, డీఎస్ఏ సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

‎తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-13‎పార్వతీపురం మన్యం జిల్లా కొత్త కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్వస్థలం అయిన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని వెంగంపల్లెలో ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామంలో చిన్నా – పెద్దా అందరూ…

ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను కిర్లంపూడి లో శనివారం జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కలిశారు. ఈ సందర్భం గా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

  • By JALAIAH
  • September 14, 2025
  • 4 views
ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

  • By JALAIAH
  • September 14, 2025
  • 5 views
రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి