

మన న్యూస్, తిరుపతి:
రాష్ట్ర రాజధాని అమరావతి పునఃప్రారంభ సభ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు కార్పొరేషన్ డైరెక్టర్ శివ శేషగిరిరావు, మంగళగిరి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఆకునూరి ఉమామహేశ్వరరావు, పూర్ణచంద్రరావు తదితర నాయకులు సభలో పాల్గొన్నారు. సదాశివం ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమరావతి పునఃప్రారంభం రాష్ట్రాభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి పున ప్రారంభ సభలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ రుద్రకోటి సదాశివం పాల్గొన్నారు. ఆయనతోపాటు రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శివ శేషగిరిరావు, మంగళగిరి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఆకునూరి ఉమామహేశ్వరరావు పూర్ణచంద్రరావు తదితర నాయి బ్రాహ్మణ సంఘ నేతలు పాల్గొన్నారు.