

మన న్యూస్, తిరుపతి:- తిరుపతి ఈస్ట్ డిఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన శ్రీ భక్తవత్సలాన్ని గురువారం ఆయన కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన డీఎస్పీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో సుబ్బరామయ్యతో పాటు గుండాల గోపీనాథ్ మనీ, అర్జునయ్య తదితరులు పాల్గొన్నారు. భక్తవత్సలం తక్షణమే ప్రజల సమస్యలపై దృష్టిసారించి, శాంతి భద్రతల పరిరక్షణకు కృషిచేస్తారని, ప్రజలతో మమేకమవుతూ ప్రజా సంబంధాలను మెరుగుపరుస్తారని ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ భక్తవత్సలం మాట్లాడుతూ, “శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దేందుకు నూతన పథకాలు అమలు చేస్తాం,” అని తెలిపారు.