

మన న్యూస్ నెల్లూరు రూరల్,ఏప్రిల్ 26 :– నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న 303 అభివృద్ధి పనుల పురోగతిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 26 డివిజన్ల ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. దాదాపుగా 303 అభివృద్ధి పనులు కాకుండా అదనంగా మరో 20 పనులు కూడా మే 15వ తేదీ లోపల పూర్తయ్యే అవకాశం ఉంది అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.దాదాపు 330 అభివృద్ధి పనులు సుమారు 40 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది అన్నారు.303 అభివృద్ధి పనులలో దాదాపుగా 90 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.మే 15 తేదీ ఉదయం 9 గంటలకు 303 అభివృద్ధి పనులు 606 మంది పార్టీ కార్యకర్తలు చేతుల మీదుగా ప్రారంభం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
