

మన న్యూస్, నెల్లూరు రూరల్, ఏప్రిల్ 26:– నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆర్డిఓ, పోలీస్ శాఖ మరియు వివిధ శాఖల సంబంధిత అధికారులతో శనివారం శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ శాఖల సంబంధిత అధికారులు తూచా తప్పకుండా వారికి కేటాయించిన విధులను సక్రమంగా పాటించాలి అని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినకూడదు. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం త్వరగా అయ్యే విధంగా చూడాలి అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు ఫెస్టివల్ కమిటీ చైర్మన్, సభ్యులు మరియు ఈ. ఓ అందరూ కలిసికట్టుగా ఏకతాటిపై ఉండాలి అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. పై కార్యక్రమంలో సీనియర్ టిడిపి నాయకులు ఇందుపూరు శ్రీనివాసులురెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, దేవరపాలెం గ్రామం ఉప సర్పంచ్ వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి, టిడిపి నాయకులు బాబు, శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ఫెస్టివల్ కమిటీ సభ్యులు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
