

కొండాపురం మన న్యూస్:: ఉదయగిరి నియోజకవర్గం లోని కొండాపురం మండలంలో గ్రామ కమిటీల ఎంపికలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. గ్రామస్థాయి నుండి టిడిపిని బలోపేతం చేసేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ సోమవారం కొండాపురం మండలంలోని గొట్టి గుండాల, వెలిగండ్ల, మర్రిగుంట, మరియు రేణిమాల పంచాయతీలలో మండల పార్టీ నాయకుల సారధ్యంలో గ్రామ నాయకులతో సమావేశమై అందరిని సమన్వయపరుస్తూ గ్రామ కమిటీలను ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారని ఆయన నాయకత్వంలో మనమందరం పనిచేయడం మన అదృష్టంగా భావించాలన్నారు. నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామ కమిటీలు కృషి చేయాలని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో గ్రామ కమిటీలు కీలక పాత్ర పోషించాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా నాతో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న వాటిని మనసులో ఉంచుకోక మనమందరం కలిసికట్టుగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. మనమందరం ఒక కుటుంబ సభ్యుల వల్లే కలిసి మెలిసి ఉంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ గ్రామ అభివృద్ధిలో తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టిడిపి మండల కమిటీ నాయకులు గ్రామ కమిటీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.