

మన న్యూస్, నెల్లూరు రూరల్,ఏప్రిల్ 21: 3 నెలలు లో పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్డు పనులు పూర్తి.
*పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్డు సి. సి డ్రైన్ లకు 90 లక్షల నిధులు విడుదల. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 32 వ డివిజన్ సంజయ్ గాంధీ నగర్ సెంటర్ లో 36 లక్షల రూపాయలు వ్యయంతో సీసీ డ్రైన్ పనులకు సోమవారం ఉదయం శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్డు లో ఈ డ్రైన్ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండదు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్డులో సిసి డ్రైన్లకు మరో 90 లక్షల రూపాయల నిధులను కేటాయిస్తున్నాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.బట్వాడి పాలెం సెంటర్ నుండి డైకాస్ రోడ్డు వరకు అత్యంత వేగవంతంగా సెంట్రల్ లైటింగ్, డ్రైన్ మరియు రోడ్డు పనులు జరుగుతున్నాయి అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.మూడు నెలల లోపు పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్డును సర్వాంగ సుందరంగా చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్, కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీ నాయకులు,జనసేన పార్టీ నాయకులు మరియు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
