

మన న్యూస్, తాడేపల్లి /నెల్లూరు, ఏప్రిల్ 20: తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ…………….కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మెగా డీఎస్సీ పై ఏవో కుంటి సాకులు చెబుతూ.. జాప్యం చేస్తూ వచ్చింది అని అన్నారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. శాసనమండలితోపాటు.. అనేక పోరాట వేదికల్లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటం చేసిందన్నారు.దాదాపుగా 11 నెలల తర్వాత నేడు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కానుక అంటూ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారనే మెహర్బానీ ప్రకటనలపై మండిపడ్డారు.మొత్తానికి ప్రభుత్వం 16,347 పోస్టులతో DSC ఇవ్వడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని.. అయితే ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ.. భర్తీ ప్రక్రియను రాబోయే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేయాలన్నారు. లేనిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున.. ఉద్యమ కార్యక్రమం చేపడతుందని హెచ్చరించారు.ఆగ మేఘాలపై ఎస్సీ వర్గీకరణ బిల్లును పూర్తి చేయడం చూస్తుంటే.. ఈ బిల్లుపై SC సంఘాల ప్రతినిధులకు పలు అనుమానాలు ఉన్నాయన్న భావన కలుగుతుందన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ లో ప్రభుత్వం ఎప్పటిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేస్తుందో.. పేర్కొనకపోవడం.. నిరుద్యోగులను గందరగోళానికి గురిచేయడమేనన్నారు.గత ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి జి ఓ నెంబర్ 117 తీసుకువచ్చి.. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యా విధానానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 117 జీవో రద్దు చేస్తామని చెప్పి.. ఆ హామీను అమలు చేయకుండానే.. మోడల్ ప్రైమరీ స్కూల్ కాన్ సెప్ట్ ను…. తీసుకువచ్చి.. ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థలను పూర్తిగా.. రద్దు చేసే పరిస్థితి తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే గ్రామీణ ఆడపిల్లలు ఇంటర్మీడియట్ విద్యకు దూరం కాకూడదనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి 510 హై స్కూల్ ప్లస్ లను తీసుకువచ్చారని తెలిపారు. హై స్కూల్ ప్లస్ విధానం ద్వారా.. ఎంతో కాలం నుంచి ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడుతున్న 8, 800 మంది స్కూల్ అసిస్టెంట్స్ కు పీజీటీ లు గా పదోన్నతులు కల్పించడం జరిగిందన్నారు.ఈరోజు హై స్కూల్ ప్లస్ లు అన్ని రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం మూర్ఖత్వమేనని మండిపడ్డారు.ఇలా జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలతో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికితే.. ఈరోజు కూటమి ప్రభుత్వం వాటన్నిటిని రద్దు చేసే దిశగా.. ఆలోచనలు చేయడం సిగ్గుచేటు అన్నారు.ప్రధానంగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియ.. సజావుగా సాగుతుందా లేదా అన్న అనుమానాలు కలగడానికి చంద్రబాబె ప్రధాన కారణమన్నారు.చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉండగా 98 ,2008,2018,2022 డిఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చి.. వాటిని భర్తీ చేయకుండా మధ్యలోనే.. నిలిపివేసి నిరుద్యోగులను నట్టేట ముంచారని ఆరోపించారు..ఆయా డియస్సి లో అన్యాయం జరిగిన 15008 మందికి.. టీచర్ పోస్టులు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దని గుర్తు చేశారు. అలాగే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే నోటిఫికేషన్ ద్వారా 1,36,000 సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసి.. నిరుద్యోగులకు అండగా నిలిచారని తెలిపారు.జగన్మోహన్ రెడ్డి ఒక్క టీచర్ పోస్టు ఇవ్వలేదని.. టిడిపి చేస్తున్న అసత్య ప్రచారాలను.. చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని.. గత 5 సంవత్సరాలలో.. జగన్మోహన్ రెడ్డి నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని.. ఇది జగన్మోహన్ రెడ్డికి నిరుద్యోగులు పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు.కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.. అని ఇచ్చిన హామీ..పూర్తిగా గాలికొదిలేసిందని మండిపడ్డారు.నిరుద్యోగులకు ఇస్తామన్న 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి.. ఏమైందో చంద్ర బాబు, లోకేష్ సమాధానం చెప్పాలని.. డిమాండ్ చేశారు. సెప్టెంబర్ నాటికి డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి కాకపోతే నిరుద్యోగులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పడుతుందని ఘాటుగా హెచ్చరించారు.