

పినపాక, మన న్యూస్ :-పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం హెచ్.పీ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలకు వెళితే సీతారాంపురం గ్రామానికి చెందిన కోడి రెక్కల నరసింహారావు, 60 సం శనివారం తెల్లవారు జామున తన పెద్ద కొడుకు ఇంటికి ఎలిసిరెడ్డిపల్లి నడుచుకుంటూ వెళుతుండగా బయ్యారం పెట్రోల్ బంక్ వద్ద మణుగూరు కు చెందిన పాల వ్యాను అతి వేగంతో నరసింహారావు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి నలుగురు కుమారులు. పెద్ద కుమారుడు స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.