

మన న్యూస్,నెల్లూరు, ఏప్రిల్ 18 :నెల్లూరు అభివృద్ధి ప్రదాత, సేవా తత్పరుడు, ప్రియతమ నేత నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరం జరగనుంది.నెల్లూరులోని కనుపర్తిపాడు సమీపంలో గల వి.పి.ఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే రక్తదాన శిబిరంలో రెడ్ క్రాస్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నారాయణ హాస్పిటల్స్ మరియు నోవా బ్లడ్ బ్యాంక్ వంటి సంస్థలు పాల్గొననున్నాయి. ఈ శిబిరంలో పాల్గొని రక్త దానం చేసేందుకు ఇప్పటికే యువత స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ మేరకు రక్తదాన శిబిరానికి అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే బెడ్లు ఏర్పాటు చేయగా.. ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు.