మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 18:గుడ్ ఫ్రైడే నాడు మానవుల కష్టాన్ని, పాపాన్ని వారి శిక్షను,క్రీస్తు స్వీకరించి శీలలను భరించి శిలువను మోసారని పురాణాలు చెబుతున్నాయి………నెల్లూరు సిటీ,కపాటి పాలెం నందు ఈ సందర్భంగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ శిలువను మోసి క్రైస్తవ సోదరుల ప్రార్థనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా క్రైస్తవ సోదరుల ప్రార్థనలు ఫలించి,భక్తి భావాలతో వారి హృదయాలు నిండాలని పుణ్యమూర్తులు సూచించిన జాలి,కృప, దయ,ప్రేమ ప్రతి మానవులు కలిగి ఉండాలన్న అన్ని మతాల సారాంశం తెలుసుకొని సత్ప్రవర్తన కలిగి ఉండాలని కోరుతున్నాం అని అన్నారు.తండాల వాసుల కష్టాలను తెలుసుకుని అడవి తల్లికి ఇచ్చిన మాట ప్రకారం కొండ మిట్టల్లో రోడ్లు వేసి పలకరించేందుకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు చెప్పులు లేని కాళ్ళను చూసి వారందరికీ చెప్పులు బహుకరించి వారి మోము తో వెలుగు చూపి సాటి మానవుని కష్టాన్ని స్వీకరించిన వారి స్పూర్తి ముందుకు నడిపిస్తూ పేదల జీవితాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్న విశ్వ నరుల స్ఫూర్తిని సాగిద్దాం లోక శాంతి కై కలసి ప్రయాణిద్దాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో క్రీస్తు ఆరాధకులు,క్రైస్తవ సోదరులతో పాటు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్,సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,51వ డివిజన్ నాయకులు సనత్ కుమార్,గజరాజు శాంతికళ,మౌనిష్, జనసేన నాయకులు నరహరి,హేమచంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *