


మర్రిపాడు మన న్యూస్: అసలే వేసవి కాలం… ఎండల తీవ్రత అధికమై ఉక్కపోతతో కూడిన అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవ్వి అల్లాడుతుంటే…అంతంత మాత్రం కురిసిన వర్షాలతో ఎక్కడ చూసినా ఎండుకుపోయిన వాగులు.. వంకలు.. చెరువులతో నోరులేని మూగజీవుల కష్టాలు అన్నీ ఇన్ని అని సెప్పుకోలేని దీన దుస్థితి నెలకొన్న నేపథ్యంలో జనావాసంలోకి వచ్చి వాటి యొక్క దాహర్తిని తీర్చుకోవడానికి వానరాలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు అని సెప్పుకోవాలి. ఇటువంటి పరిస్థితితులలో ఒక సన్నివేశం చూపారులను కట్టివేసింది. వివరాలలోకి వెళితే మర్రిపాడు మండల కేంద్రంలోని రక్షకభట నిలయం పరిసర ప్రాంతం లో కొన్ని వానరాలు వేసవి తాపానికి నీటికోసం అలమాలడుతున్న పరిస్థితిని స్థానిక ఎస్సై కాసుల శ్రీనివాసరావు గమనించి మూగజీవాలపై తనకున్న దయహృదయాన్ని వ్యక్త పరిచేందుకు గానూ వానరాలాకు వాటర్ బాటిల్ ల సాయంతో వాటి దాహర్తిని తీర్చారు. ఈ సంఘటన అక్కడి చూపరులను కట్టివేసే సన్నివేశం చుసిన పలువురు నేటిజన్లు ఎస్సై కాసుల శ్రీనివాసరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.