మన న్యూస్ సాలూరు ఏప్రిల్8:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజన్‌ను అమలు పరచే భాగంగా, సాలూరు మార్కెటింగ్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది. ఇందులో ముఖి సూర్యనారాయణ చైర్మన్‌ ఇతర సభ్యులు సహా వైస్ చైర్మన్‌ మింది సింహాచలం, ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నూతన పాలకవర్గ సభ్యులందరిని ఘనంగా సన్మానించి, హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ: “వ్యవసాయ రంగం అభివృద్ధికి మార్కెటింగ్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రైతుల ఉత్పత్తులకు సరైన ధర, సమర్థమైన మౌలిక వసతులు, పారదర్శక విధానాల అమలులో ఈ కమిటీల పాత్ర అమూల్యమైనది. ముఖి సూర్యనారాయణ, అనుభవం కలిగిన, వ్యవసాయ సమస్యల పట్ల లోతైన అవగాహన కలిగిన నాయకులు. ఆయన నాయకత్వంలో ఈ కమిటీ రైతుల సంక్షేమానికి అనేక విలువైన నిర్ణయాలు తీసుకుంటుందని నమ్మకంగా చెప్పగలను. ఇతర సభ్యులైన వైస్ చైర్మన్ మింది సింహాచలం . మరియు 15 మంది కమిటీ సభ్యులకు కూడా మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. వారు తమ సమయపాలన, ప్రజాసేవా మనోభావంతో సాలూరు నియోజకవర్గ రైతాంగానికి శక్తివంతమైన మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. రైతులు బలపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఈ నూతన పాలకవర్గం రైతుల ఆశల్ని నెరవేర్చేందుకు కృషి చేస్తుందని ఆశిస్తున్నాను,అని గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *