

మన న్యూస్ సాలూరు ఏప్రిల్ 8:=పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో మర్రి పిల్లి, మామిడిపల్లి, లో గొర్రెలకు మేకల పెంపకం దారులు సంఘం నాయకులు. కోరాడ కాశయ్య. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు చెరువుగట్లు జీవాలను మేపుకోవడానికి అనుమతి కల్పించాలని అడవుల్లో జీవాలు మేపుకోవడానికి పాత తోవలు ఇవ్వాలని 559. మరియు 10 16 జీవోలు ప్రకారం జీవాలకు నిలుపుకోవడానికి స్థలాలు కొండలకు తోవలు కల్పించి ప్రభుత్వం గొర్రెల కాపర్లు వృత్తిని అభివృద్ధి బాటలో నడిపించాలని అన్నారు ప్రతి సంవత్సరం ఈ గొర్రెల పెంపకం వృత్తి వలన రాష్ట్ర ప్రభుత్వానికి 1600 కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్న వారి అభివృద్ధి కోసం కృషి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. ప్రధానంగా చెరువుగట్టుల్లో మొక్కలు వేయడం కొంతమంది ఆక్రమించుకోవడం వలన జీవాలు నిలుపుకోవడానికి త్రాగడానికి నీటికి ఇబ్బందులు గురవుతున్నారని దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి గొర్రెల పెంపకం వృత్తి అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. జవాలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని. పేద గొర్రెల మేకల పెంపకం దారులకు నిజమైనటువంటి వృత్తిదారులకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
