గొల్లప్రోలు మార్చి 20 మన న్యూస్ :- పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) పీడీ చైత్ర వర్షిణి గురువారం పిఠాపురం నియోజకవర్గంలో మూడు మండలాల పరిధిలోఉన్న అగ్రికల్చర్, ఇరిగేషన్,హార్టికల్చర్, ఫిషరీస్,వెటర్నరీ,సెరికల్చర్ డిపార్ట్మెంట్ మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా పీడీ చైత్ర వర్షిణి.. సంబంధిత అధికారులను నియోజకవర్గం లో వారి డిపార్టుమెంట్ పరిధిలో జరుగుతున్న పనుల కోసం కావాల్సిన అవసరాలు అడిగి తెలుసుకున్నారు అలాగే స్కీమ్స్ అన్ని ప్రజలకు చేరే విధంగా చర్యలు చేపట్టాలని , ఏమన్నా సమస్యలు ఉంటే వెంటనే వాటిని ఫాడా దృష్టికి తీసుకురావాలి అని ఆదేశించారు . అలాగే ఆమె గొల్లప్రోలు మండలం లో సుద్దగెడ్డ కాలువ పై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు,అనంతరం చేబ్రోలు గ్రామంలో పట్టుగుళ్ళు షెడ్ ని సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అలాగే పట్టు పరిశ్రమ మార్కెట్ కి వెళ్లి అధికారులతో మాట్లాడారు అక్కడ పెండింగ్ లో ఉన్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు,ఈ పరిశీలనలో పీడీ వెంట ఏపీడీ పి.వశంతమాధవి మరియు సంబంధిత మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *