

నెల్లూరు, మన న్యూస్, మార్చి 10:- నెల్లూరు,రామలింగాపురం మెయిన్ రోడ్డు లో సోమవారం ఉదయం ఎం ఎం గరీబ్ బిర్యానీ ఏ/సి ను తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించినారు. ఈ సందర్భంగా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ…… సోదరుడు షేక్ రషీద్ భాష నాలుగు బ్రాంచ్ లు దిగ్విజయంగా నడుపుతూ నేడు ఐదో బ్రాంచ్ ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు.నెల్లూరు ప్రజలందరూ ఎం ఎం గరీబ్ బిర్యానీ వచ్చి బిర్యానీ ఆరగించవలసిందిగా కోరుచున్నాను అని అన్నారు. అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ……. నెల్లూరు అంటే ఫుడ్, ఫుడ్ అంటే నెల్లూరు అనే విధంగా నేడు నెల్లూరులో చాలా హోటల్స్ ప్రారంభిస్తున్నారు. రషీద్ భాషా ఏడు సంవత్సరాల నుండి నాలుగు బ్రాంచ్ లు దిగ్విజయంగా నడుపుతూ నేడు ఐదో బ్రాంచ్ ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. బిర్యానీ హోటల్స్ లో వండే విధంగా ఇంట్లో కూడా వండరు. మంచి రుచితో నాణ్యమైన బిర్యాని అందిస్తున్నందుకు అభినందిస్తున్నాను అని అన్నారు. ప్రజలందరూ ఎం ఎం గరీబ్ బిర్యానీ ని ప్రోత్సహించవలసినదిగా మనస్పూర్తిగా కోరుతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రంగా మయూర్ రెడ్డి, ఎం ఎం గరీబ్ బిర్యానీ అధినేత రషీద్ భాష, షేక్ జరీనా తాజ్ మరియు బందు మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
