ఎమ్మెల్యే కోటాలో తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి

Mana News :- ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మరి కొన్ని గంటల్లో ముగియనుంది. అలాంటి వేళ తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి పేరు అనుహ్యాంగా తెరపైకి వచ్చింది. ఆమె పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు చెబుతున్నా.. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్.. రాములమ్మ పేరును తెరపైకి తీసుకు వచ్చినట్లు ఓ ప్రచారం అయితే ఆ పార్టీలో అంతర్గతంగా సాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు జస్ట్ కొద్ది రోజుల ముందు విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే సమయంలో బీజేపీపై ఆమె విమర్శనాస్త్రాలు సంధించిన విషయం విధితమే. ఇక ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తిరింది. అయితే.. ఆ నాటి నుంచి మళ్లీ విజయశాంతి ఎక్కడా కనిపించ లేదు. ఆమెను ఏ పదవి వరించలేదు. కానీ తాజాగా ఎమ్మెల్యే కోటాలో జరుగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. ఆమె పేరు చాలా అనుహ్యాంగా తెరపైకి రావడం గమనార్హం. తొలుత విజయశాంతి బీజేపీలో అంటే.. 1998లో చేరారు. అనంతరం ప్రత్యేక తెలంగాణ కోసం 2009లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ పార్టీని అదే ఏడాది టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. ఆ మరుసటి ఏడాదే అంటే.. 2010లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ కొద్ది రోజులకే మళ్లీ మనస్సు మార్చుకొని టీఆర్ఎస్‌ పార్టీలోకి పున ప్రవేశం చేశారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకరమవుతోన్న వేళ.. మరోవైపు అసెంబ్లీతోపాటు సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న వేళ.. టీఆర్ఎస్ నుంచి దూరం జరిగి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే 2020లో మళ్లీ విజయశాంతి బీజేపీలో చేరారు. ఇక 2023లో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో మహబూబ్ నగర్ నుంచి టీఆర్ఎస్ ఎంపీగా ఆమె విజయం సాధించారు. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను తనకు దేవుడిచ్చిన సోదరుడంటూ ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె ఆ పార్టీని వీడారు.అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమవుతోన్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు ఆ పార్టీ అధిష్టానంతో విజయశాంతి సన్నిహితంగా మసలుతోన్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ కారణంగానే కేసీఆర్.. ఆమెను దూరం పెట్టారనే ఓ ప్రచారం సైతం సాగింది.ఏదీ ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడాదిన్నర తర్వాత విజయశాంతి శాసన మండలిలో అడుగు పెట్టే అవకాశం లభించడం ద్వారా జాక్ పాట్ కొట్టిందనే ఓ చర్చ సైతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు