

మనన్యూస్,పాచిపెంట:పాచిపెంట మండల ప్రత్యేక అధికారి వి రాధాకృష్ణ హౌసింగ్ కాలనీ సందర్శించారు.అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.శుక్రవారం నాడు ఆయన హౌసింగ్ శాఖ ఏఈ తో కలిసి వెళ్లి కాలనీలో రహదారులు,త్రాగునీటి సమస్య గురించి తెలుసుకొని వీధి రహదారులు నిర్మాణానికి ప్రభుత్వానికి తెలియజేస్తానన్నారు. త్రాగునీటి సమస్య లేకుండా తక్షణమే బాధితులకు పరిష్కారం చూపించాలన్నారు.ప్రభుత్వ కార్యాలయంలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించడానికి అవసరమైతే ఉపాధి హామీ పథకం ద్వారా పిచ్చి మొక్కలు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉపాధి హామీ సిబ్బందికి ఆదేశించారు.గిరిజన సంక్షేమ వసతి గృహాలు పరిశీలించారు.పిల్లలకు సక్రమంగా ఆహారం అందుతుందా.లేదని అడిగి తెలుసుకున్నారు.ఆయన అలాగే పల్లె పండగ కార్యక్రమంలో నిర్మిస్తున్న పలు రహదారులు ఆయన పరిశీలించి నాణ్యత ప్రమాణ ల గురించి అడిగి తెలుసుకున్నారు.పద్మాపురం సచివాలయంలో ఆయన రికార్డులు తనిఖీ చేసి సంబంధిత పంచాయతీ కార్యదర్శికి సలహాలు సూచనలు ఇచ్చారు.ఆయనతోపాటు ఎంపీడీవో బీజే పాత్రో,హౌసింగ్ ఏ ఇ వెంకటేష్,పి ఆర్ ఏఈ ఫరూక్,వర్క్ ఇన్స్పెక్టర్ లోకేష్,ఉపాధి హామీ ఏపీఓ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు